హనుమంతుడి పరాక్రమములు






హనుమంతుడి పరాక్రమములు

హనుమంతుడు అంజనీ సుతుడు, వాయు దేవునీ ఔరస పుత్రుడు మహా బలశాలి. వైశాఖ మాసం బహుళ దశమి నాడు హనుమంతుడు జన్మించాడు. పుట్టుకతోనే బలసంపన్నుడు, హనుమంతుడుని మనం ఆంజనేయుడు అనికూడా పిలుస్తాము. ఒకసారి ఉదయిస్తున్న సూర్యబింబమును చూసి పండు అనుకుని తినటానికని ఆకాశంలో ఎగిరాడు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుదముతో ఆంజనేయుని దవడ పై కొట్టాడు , అలా కొట్టడం వల్ల ఆంజనేయునికి హనువు (గడ్డం ) విరిగింది అందువల్ల హనుమంతుడు అని పిలుస్తాము.  కేవలం ఇద్దరికి మాత్రమే సింధురముతో పూజ చేస్తారు ఒకరు వినాయకుడు రెండవవారు హనుమంతుడు. హనుమంతుడు రాముడికి వీర భక్తుడు. ఈయనకు మించిన రామ భక్తిని వేరేవ్వరిదేగ్గర చూడలేము అంటే నమ్మితీరవలసిందే. ఈయనకు ఒక లక్షణము ఉన్నది అది ఏమిటంటే స్వామి నీవు తప్ప వేరెవ్వరు ఈ కార్యక్రమము చేయలేరు అని అయన పరాక్రమము ఒక్కసారి చెబితే చాలు ఎంతటి అసామాన్యమైన కార్యక్రమము అయిన చేసేస్తాడు. అంతటి బలశాలి. ఎంతటి వారి అహంకారాన్ని అయిన ఈయన పోగొట్టగల సమర్దుడు. ఆరోగ్య ప్రదాత , ఆయుర్దాయమును పెంచుతాడు. హనుమంతుడు లేనిదే రామాయణం లేదు. సుగ్రివుడికి రామ, లక్ష్మణులను పరిచయము చేసింది హనుమంతుడు. సీత లంకలో బందీగా ఉండగా జాడను తెలుసుకున్నది హనుమంతుడే , రావణ లంకకు నిప్పు పెట్టి రావణుడికి నీ పతనం రామ బాణం వల్ల కలుగుతుంది అని చెప్పింది హనుమంతుడే. హనుమంతుడు చెప్పినది జరుగుతుంది, అందుకే హనుమంతుని భక్తుల నోటి వెంట వచ్చే వాక్యములు జరిగి తీరుతాయి. ఎవరిదైనా అహంకారమును నసింపచేస్తాడు. ద్వాపర యుగములో శ్రీ కృష్ణుడు సత్యభామ అహంను పారదోలడానికి గరుడ చేత కబురు పంపించాడు. గరుడు వెల్లి కబురుచేప్పి రాముడు రమ్మన్నాడు అని చెప్పి నామీద ఎక్కు నేను తీసుకువేల్తాను అనే లోపు కృష్ణుడు దెగ్గరకు వెళ్ళిపోయాడు, ద్వారం వద్ద అడ్డగించిన సుదర్షుడుని మింగేసాడు. రామావతారము లో కృష్ణుడు పక్కన ఉన్న సత్యభామను చూసి స్వామి మా అమ్మ సీతమ్మ ఎక్కడ అని అడిగాడు దానికి కృష్ణుడు బదులిస్తూ, మీ తల్లి సీతాదేవి ఈ యుగములో రుక్మిణి దేవిగా అవతరించింది అని బడులిచ్చాడు. అహంకారముతో ఉన్న సత్యభామకు తత్వం బోదపడింది. ఎగరులేవు అన్న గరుడకు , అడ్డగించిన సుదర్షుడకు , అహం నిండిన సత్యభామకు వారి స్థాయిని వారేగుర్తించేలా చేసాడు. సంజీవని పర్వతాన్ని తేచ్చి లక్ష్మణుడు ప్రాణాలను, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతకు చూపి రాముడు సీత కోసం పరితపిస్తున్న విషయాన్నీ, రావణ లంక దహనమును, శతయోజనాలు ఉన్న సముద్రాన్ని దాటడము, రాముడి ఫై ఉన్న భక్తి ఇలా ఒకటికాదు ఎన్ని చెప్పిన తక్కువే. సీత దేవి పాపిట సిందూరం రాముని ఆయుర్దాయము కొరకు ధరించాను అని చెప్పిన కారణముగా రాముడు దీర్గాయువుతో ఉండాలని శరీరము అంతా సిందూరము పూసుకున్న మహా రామ భక్తుడు. అయిదు అన్న ఇష్టము. అరటి పళ్ళు అన్న మహా ఇష్టము. హనుమంతుని ఆలయము నందు అయిదు ప్రదక్షిణాలు, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంటూ చేయాలి. 





Post a Comment

0 Comments