పంచ మహ పాతకాలు







శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః



పంచ మహ పాతకాలు 




పంచ మహా పాతకములు(పెద్ద  తప్పులు) అయిదు. చేయకూడనివి తప్పులలో అతి పెద్ద తప్పులనే మహాపాతకాలు అంటారు.వీటిని చేయడం, చేసినవారిని సమర్దించడం కూడా అంతే పాతకమును చేసినట్లు అవుతారు. చాల మంది నా అనే వాళ్ళు తప్పుచేస్తే ఒకలాగా, బయటి వాళ్ళు అంటే తెలియని వాళ్ళు తప్పుచేస్తే ఒకలాగా స్పందిస్తారు. అంటే తెలిసిన వాడు తప్పుచేస్తే మనవాడు కదా అని తప్పును కప్పిపుచ్చడం, లేదా సమర్దించడం చేస్తారు. దీని వలన సమర్దించిన లేదా తప్పు చేస్తున్నాడని తెలిసి నచ్చచేప్పకపోవడం రెండు కూడా ఆ తప్పులో బాగస్వామ్యం ఉన్నట్లే. అప్పుడు ఆ పాపము వారికీ కూడా అంటుకుంటుంది. ఒక తప్పును చేయడము వలన వేల జన్మలు దాని చెడు పలితాలను అనుభవించక తప్పదు.

మహాపాతకములు అయిదు రకాల అందుకే వాటిని పంచ మహా పాతకములు అన్నారు. అవి బ్రహ్మ హత్య మహాపాతకము , సువర్ణ చౌర్య మహా పాతకము , సురాపాన మహాపాతకము , గురుపత్ని సాంగత్యం , ఈ నాల్గింటిని సమర్దించడం అయిదవ మహా పాతకం.





బ్రహ్మ హత్యా మహా పాతకం


బ్రాహ్మణుడు , వేద విద్యా అభ్యసించిన వారు , పండితులను హత్య చేయటం వలన ఈ మహా పాతకం అంటుకుంటుంది. పండితులు , బ్రాహ్మణులు వీరు విశ్వ శ్రేయస్సుకోరే వారు అంటే అందరి శ్రేయస్సును కోరేవారు. అలగే గోవు కూడా విశ్వ శ్రేయస్సు కోరి అనేక మైన దివ్య ఔషద గుణాలున్న పదార్దాలను ఇవ్వడమే కాకుండా సమస్త దేవతలు కొలువుండే గర్భగుడిగా కొలుస్తాము అందువలన బ్రాహ్మణుడిని , పండితుడిని , గోవును హత్య చేయడం ద్వార ఈ బ్రహ్మ హత్య మహాపాతకం చుట్టుకుంటుంది.




సువర్ణ చౌర్య మహా పాతకం


బంగారమును దొంగతనము చేయడం ద్వార ఈ పాతకం చుట్టుకుంటుంది. సాదారణంగా దొంగతనం చేయడం పాపం చేసినట్లే అలాంటిది బంగారమును దొంగతనం చేయడం అత్యంత పెద్ద పాపము అందుకీ దీనిని మహా పాతకములో చేర్చడం జరిగింది .



సురాపాన మహా పాతకం 


మద్యం సేవించడం ద్వార వచ్చే పాపాన్ని సురాపాన మహా పాతకము అంటారు. మద్యం సేవించడం ద్వార మతి మంద మతి అయ్యి ఎదుట ఉన్నవారు ఆడ, మగ, పిల్ల , పెద్ద , గురు , దైవం అనే విషయాన్నీ మరచి దుర్భాషలు ఆడటం , నీ వెంతటి వాడవు అనే మాటలను ఉచ్చరిస్తూ ఉంటారు. అందుకే సురాపానం మహా పాతకము అయినది.


గురుపత్ని సాంగత్యం మహా పాతకం


గురువు గారి బార్యను తప్పుడు ద్రుష్టి తో చూసి గురువు గారు భార్య నిద్రించే మంచము పైన ఆమె తో పాటు ఉండి సాంగత్యం చేయడం ద్వార కలిగేది గురుపత్ని సాంగత్య మహా పాతకం.



ఇక అయిదవది పైన ఉన్న వాటిని సమర్దించడం ద్వార వచ్చేది 


పైన ఉన్న వాటిలో ఏ ఒక్క దానినైన చేసిన వ్యక్తిని సమర్దించడం లేదా చేసిన వాడు నా స్నేహితుడు, నా భందువు, నా వాడు అని చెప్పినా కూడా ఈ అయిదవ మహా పాతకమును పొందుతాడు.



పైన చెప్పిన మహాపాతములలో ఏది చేసిన ఎన్ని జన్మములు అయిన నిష్కృతి ఉండదు కేవలం భగవంతుడి నామ స్మరణ ద్వార మాత్రమే మనకు కాస్తంత ఉపసమనం ఉంటుంది. 





బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు


Visit us at : www.vedanthavarshini.com


Email :  vedanthavarshini@gmail.com


All  right reserved @ copyright protection under the Copyright Act.

Post a Comment

0 Comments