ఓం శ్రీ మహా గణపతియే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీర
భద్రేశ్వర స్వామినే నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే
నమః
గోదావరి నది ఏర్పడిన సందర్బము
గౌతమ మహర్షి ఈయన సప్త ఋషులలో ఒకరు. గోదావరి నది పుట్టుకకు కారకుడు గౌతమ మహర్షి. గోదావరిని గౌతమీ నది అని కూడా పిలుస్తారు. పూర్వము గౌతమ మహర్షి దండకారణ్యములో ఉండే వాడు. ఆ సమయములో అక్కడ పచ్చటి చెట్లతో పాడిపశువులతో వర్షాలతో సుబిక్షంగా ఉండేది. 12 సంవత్సరాలు వర్షాలు లేక క్షామం (కరువు) ఏర్పడింది. ఇది చూసి గౌతమమహర్షి అక్కడ ఉన్న తోటి ఋషులకు , శిష్యులకు తన తపోశక్తితో 12 సంవత్సరాలు వారికీ కావలసిన ఆహారాన్ని అందించాడు. తోటి ఋషులు గౌతమ మహర్షికి ఉన్న తపోశక్తికి ఈర్ష్య చెంది ఒక మాయ గోవును సృష్టించి పాడిపంటలలో వదులుతారు అది చుసిన గౌతమ మహర్షి ఒక గడ్డిపరకతో అదిలించగా అది మరణించి గో హత్యా మహాపాతకం చుట్టుకుంది. గౌతమ మహర్షి చుట్టుకున్న గోహత్యపాతకం నివృతి కోసం తపస్సు తో శివుడిని మెప్పించి శివుని తలపైన జటాజటములో ఉన్న గంగను భుమి మీదకు తెప్పించి ఆ గోవు పై నుండి ప్రవహించేలా చేసి తిరిగి ఆ గోవుకు ప్రాణము రావడముద్వార గోహత్యమహాపాతకము నుండి విముక్తిని పొందాడు. ఆ విదముగా ఆ గోవుకు స్వర్గానికి వెళ్ళింది. ఆ గోవు ఉన్న ప్రదేశమును గోష్పాద క్షేత్రాముగా ప్రసిద్ది చెందింది. ఆ విదముగా గంగ గోదావరిగా దక్షిణ భారత దేశంలో ఏర్పడింది.
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
Visit us at : www.vedanthavarshini.com
Email : vedanthavarshini@gmail.com
All right reserved @ copyright protection under
the Copyright Act.

0 Comments