ఓం శ్రీ మహా గణపతియే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీర భద్రేశ్వర స్వామినే నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీర భద్రేశ్వర స్వామినే నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః
***శ్రీ నరసింహావతారము***
దైత్యరాజు అయిన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు ఒక నాడు అసురబాలకులతో భక్తిలో మునిగి నారాయణ నామస్మరణ చేస్తున్నారు. అది చుసిన బటులు వెళ్లి హిరణ్యకశిపునికి జరిగినది అంతా వివరించారు. దానికి హిరణ్యకశిపుడు ఆగ్రహించి ప్రహ్లాదుడిని వదించాలి అని నిర్ణయించుకున్నాడు. పరుషపదజలముతో ఓరి మందమతి! నీకు ఎంత ధైర్యము , నన్ను చూడగానే ఈ జగత్తులో సకల ప్రాణులు బితిల్లుతాయి అలాంటిది నీవు ఎవరి బలం చూసుకుని ఇంత ధైర్యంతో నా ఆజ్ఞాని దిక్కరిస్తూ ఆ నారాయణుడి నామమును తలుస్తున్నావు.
తండ్రి పలికిన మాటలకూ బదులుగా ప్రహ్లాదుడు రాజ ! నా శరీరములోప్రవహించేది ని రక్తమే కదా . నీకు ఉన్న ధైర్యం నాకు వచ్చినది. అయినా ఈ విశ్వములో ఉన్న అన్ని ప్రాణులు ఆ నారాయణుడు బలం చేతనే నియత్రించబడతాయి. ఈ రాక్షస గుణమును విడిచిపెట్టి ఆ నారాయణుడి నామాన్ని స్మరించి నీ పాపములకు విసర్జించుము అని చెప్పగా హిరణ్యకశిపుడు ఆవేశముతో రెచ్చిపోయి తన దంతములను శబ్దము చేస్తూ నీ నారాయణుడు నాకన్నా గొప్పవాడు అన్నట్లు మాట్లాడుతున్నావు నీకు చావు దేగ్గరపడింది అందుకే అదిక ప్రేలాపన చేస్తున్నావు. సరే నీ నారాయణుడు సర్వత్ర ఉండేవాడు అయితే ఈ స్తంబములో ఉన్నడా అని ప్రశ్నింఛి
నిన్ను ఇప్పుడు నా ఖడ్గంతో ని శిరస్సుని ఖండిస్తా నీ నారాయణుడు వస్తాడేమో చూద్దాము అని అన్నాడు. అంతే! భికర శబ్దముతో అష్టదిక్కులు పెల్లుబికేలా బ్రహ్మాండాన్నే బ్రద్దలు చేస్తూ ఆ సభా స్థలములో ఉన్న స్థంబము నుండి శబ్దం వచ్చినది. ఆ శబ్దానికి హిరణ్యకశిపుడు ఒక్కసారిగా అదిరిపడ్డాడు , అక్కడున్న రాక్షసులు అందరు కూడా శబ్దము ఎక్కడి నుండి వచ్చినది అని అన్ని దిక్కులు చూస్తుండగా. సింహము కాదు అలా అని మానవ రూపము అసలు కాదు అలంటి రూపముతో ఆ స్థంబము నుండి నరసింహ అవతారములో నారాయణుడు ప్రత్యక్షమై సింహ గర్జనతో హిరణ్యకశిపుడు మీదకు వెళ్లి తనని రెండు చేతులతో ఎత్తుకుని సభా ద్వారము వద్దకు తీసుకువెళ్ళి తొడలపైన ఉంచుకుని తన గోళ్ళతో ఉన్న చేతులతో నేత్రాలను పెకిలించి , ఉదరము పై నుండి హృదయాన్ని పెళ్ళగించి , పేగులను మెడలోవేసుకుని హిరణ్యకసిపుడిని సంహరిచాడు. రక్తసిక్తముగా ఆవేశముతో ఉన్న నారాయణుడిని చుసిన బ్రహ్మ, శివుడు , ఇంద్రుడు, సకల దేవతలు నారాయణుడిని శాంతపరచడానికి స్తుతించారు. కానీ నారాయణుడి శాంతించలేదు. అక్కడున్న దేవతలు అందరు లక్ష్మీదేవిని నారాయణుడి దెగ్గరకు వెళ్ళి శాంతపరచమని చేప్పగా! ఇలాంటి అసాదారణ రూపాన్ని ఇదివరకేప్పుడు నేను చూడలేదు అందువల్ల ఆ కార్యము నాకు అసాధ్యము అని చెప్పింది. ఇక ప్రహ్లాదుడు మాత్రమే నారాయణుడిని శాంత పరచాగలదు అని ప్రహ్లాదుడికి ఈ విషయాన్ని ప్రహ్లాదుడికి చెప్పగా సమ్మతించి నారాయణుడిని పాదపద్మాలను స్పృశించి, నమస్కరించి శ్రీ హరిణి స్తుతించాడు. ఆ నారాయణుడు ప్రహ్లాదుడి భక్తికి మెచ్చి శాంతించాడు.
భక్త ఏదిన కోరిక కోరుకొనుము అని నారాయణుడు అడుగగా! స్వామి నేను అసురుల జన్మించిన వాడిని నాకు ఎ వరము వద్దు. నేను సహజముగానే నీ భక్తుడిని కావున నీకు చెందినవి అన్ని నాకు చెందును. నాకు ఎలాంటి వరము వద్దు స్వామి. నాకు వరము ఇవ్వాలని పట్టుబడితే నా హృదయములో ఎన్నటికి ఎలాంటి కోరికలు కలగకుండా వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. ప్రహ్లాదుడి మాటలకూ పరవశించి , ని చరితాన్ని నా చరితాన్ని తలచుకునే వారు కర్మఫలము నుండి బయట పడతారు. నీ కారణముగా నీవు, నీ తండ్రి పాటు 21 తరముల వారు పవిత్రులు అయ్యారు అని చెప్పి, రాజ్య పాలన స్వికరించమని కర్తవ్యోపదేశం చేసి మయామైనాడు.
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
Visit us at : www.vedanthavarshini.com
Email : vedanthavarshini@gmail.com
All right reserved @ copyright protection under the Copyright Act.

0 Comments