వేదాలలో ఉన్న స్నానాలు రకాలు



ఓం శ్రీ మహా గణపతియే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీర భద్రేశ్వర స్వామినే నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః



వేదాలలో ఉన్న స్నానాలు రకాలు 


వేదాలలో ఉన్నటువంటి కొన్ని స్నానాలు గూర్చి తెలుసుకుందాం.సాదారణముగా  తల స్నానం లేదా మాములుగా స్నానం చేస్తుంటారు. వేదాలలో స్నానాలు వివిధ రకాలుగా విబజించాబడ్డాయి. అవి మృత్తికా స్నానం, బస్మ స్నానం , దివ్య స్నానం , వాయవ్య స్నానం, అభ్యంగన స్నానం మరియు అఘ మర్షణ స్నానం.


మృత్తికా స్నానం


ఆయుర్వేదంలో మృత్తికా స్నానం గూర్చి చాల వివరంగా వివరించబడింది. కొన్ని చెట్లు పెరిగే చోట్లలో సమికరించిన మట్టిని దేహానికి పూసి కొన్ని రుగ్మతలను పోగొట్టటానికి అనుసరిస్తారు. వేదాల నుండి ఉద్బవించినదే ఆయుర్వేదం.

పవిత్ర ప్రదేశముల నుండి సేకరించిన మట్టిని మంత్రోక్తంగా దేహానికి పట్టించుటను మృత్తికా స్నానం అంటారు. ఇది మనం పర్వత ప్రాంతాలలో , అరణ్య ప్రాంతాలలో ఉండే మునిశ్వరులు ఆచరిస్తారు.


బస్మ స్నానం


మంత్ర ఉచ్చరణ చేస్తూ విభూతిని దేహానికి పుసుకోవడమే భస్మ స్నానం. ఉత్తర భారత దేశంలో ఎక్కువగా కనిపించే అఘోరాలు ఇది పాటిస్తారు. శివుడు స్మశానంలో ఉంటాడని విభూతి దరిస్తాడని, 
అందరికి తెలుసు. ఆయనకి విభూతి తో అభిషేకం అంటే ప్రీతీ అని అందరికి తెలిసిన విషయము.




దివ్య స్నానం


ఉత్తరాయణ కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయములో పడేటటువంటి వర్షంలో స్నానం చేయడాన్ని దివ్య స్నానం అంటారు .




వాయవ్య స్నానం


వాయవ్య స్నానం అనగా .. గోవుల మంద నడుస్తున్న సమయములో వాటి గిట్టలు ద్వార ఎగసిపడే దుమ్ము దేహానికి పట్టించడాన్నివాయవ్య స్నానం అంటారు. గోవులో సమస్త దేవతలు కోలువై ఉంటారని ప్రసిద్ది అందుచేత వాయవ్య స్నానం చేయుటవలన పుణ్యస్నానం చేసినట్టే.




అభ్యంగన స్నానం


పండగలు, శుభదినాలలో చేసీ స్నానం ఇది. శిరస్సుకు , దేహానికి తైలం పట్టించి తలస్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అంటారు. దీనిని కూడా ఆయుర్వేదం లో ఉపయోగిస్తారు.




అఘ మర్షణ స్నానం


కొన్ని సమయాలలో వృద్దులు లేదా ఆరోగ్య పరిస్థితి బాగోలేని సమయాలలో, నీరు దొరకనప్పుడు ఆచరిస్తారు ఈ అఘ మర్షణ స్నానం.

తడి చేసిన వస్త్రాన్ని ఉపయోగించి దేహాన్ని అంతటిని సుద్దిచేసుకునే విదానాన్ని అఘ మర్షణ స్నానం

అంటారు. 





బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు



Visit us at : www.vedanthavarshini.com

Email :  vedanthavarshini@gmail.com

All  right reserved @ copyright protection under the Copyright Act.

Post a Comment

0 Comments