సర్పయాగం






శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః






సర్పయాగం 




సర్ప (పాములు) జాతిని పూర్తిగా అంతం చేయాలి అని ఉదంకుడు అనే బ్రాహ్మణుడు , పరిక్షితు కుమారుడు జనమేజయుడు చేత ఈ యాగాన్ని ఎందుకు చేయించాడు అనేది తెలుసుకుందాం .


పైలుడు అనే మహర్షి వద్ద ఉదంకుడు విద్యను అబ్యాసించేవాడు. విద్యాభ్యాసము పూర్తి అయిన తరువాత గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలని భావించి గురువుగారి వద్దకు వెళ్లి గురువర్య మీకు గురుదక్షిణ ఇవ్వదలిచితిని మీ ఆజ్ఞానుసారము ఏమి ఇవ్వమంటారు అని గురువుగారిని వినమ్రతతో అడిగాడు శిష్యుడు. దానికి బదులిస్తూ నాయనా  నాకు ఎలాంటి కోరికలు లేవు అని చెప్పి , నా భార్యకి ఏమైనా కావాలేమో అడుగు అని అన్నారు. ఉదంకుడు ఆ తల్లి దెగ్గరకు పోయి తల్లి గురుక్షిణగా ఏమి ఇవ్వమంటారో సెలవివ్వండి అని అడిగాడు. దానికి ఆ తల్లి పుణ్యక వ్రతం చేద్దాం అని తలుస్తున్నాను. దివ్యమైన మహా కుండలాలు (చెవికి పెట్టుకునే ఆభరణము) కావాలని చెప్పింది. దానికి సరే అని చెప్పి బయలుదేరి వెళ్లి వాటిని తీసుకు వస్తుండగా మర్గామద్యంలో తక్షకుడు సర్పజాతికి చెందినవాడు మారువేషములో దిగంబరముగా శరీరముపై వస్త్రములు ఏమి లేకుండా ఒక పిచ్చి వాడిలాగా ఎదురు పడ్డాడు. ఇంతలో సంద్యా వందనం అయిందని తలచి ఉదంకుడు తన దెగ్గరున్న దివ్యమైన కుండలాలను అక్కడున్న వృక్షం వద్ద బద్రపరిచాడు , అంతా మారు వేషములో ఉండి గమనిస్తున్న తక్షకుడు వాటిని అపహరించాడు. అపహరించిన కుండలాలతో పరుగులు తీస్తూ సర్పంగా తన నిజ స్వరుపముతో ఒక పుట్టలోకి చేరి నాగలోకానికి వెళ్ళిపోయాడు. ఓహో అపహరించింది తక్షకుడు అని తెలిసి తక్షకుడు ఉండే నాగలోకానికి వెళ్ళటం కోసం సకల విద్యలు నేర్చిన ఉదంకుడు ఒక కీటకముగా మారి నాగలోకానికి చేరాడు. నాగలోకం అంతా చీకటిగా 
ఉంది. కోటానుకోట్ల సర్పాలులో తక్షకుడు ఎక్కడున్నాడో తెలియడం లేదు. వెంటనే నాగ లోక అధిపతి , శ్రీ మహా విష్ణువు వద్ద వేయి పడగలతో ఉన్న వాసుకిని ప్రార్దించి తను వచ్చిన కార్యమును గూర్చి చెప్పి అనుగ్రహమును పొందాడు. సకల విద్యాసంపన్నుడు అయిన ఉదంకుడు ఈ నాగలోకములో ఎవరైతే పాప కార్యములను చేసారో వారిని దహించమని శపించాడు. దొంగతనము చేయడం మహాపాపము కనుక తక్షకుడు మంటలతో విలవిల లాడుతూ క్షమించమని వేడుకొని తను అపహరించిన ఆ కుండలాలను ఉదంకుడికి ఇచ్చేసాడు. వెంటనే వాటిని తీసుకుని గురుపత్ని వద్దకు వెళ్లి తన గురుదక్షిణ ను సమర్పించాడు. కాని తన వద్ద తక్షకుడు అపహరించిన విషయమును మర్చిపోలేక నాగ జాతి పట్ల ద్వేషమును పెంచుకుని, అసలు ఈ తక్షకుడు ఎవరు అని దివ్యదృష్టితో పరిశిలించి , తక్షకుడు పాండవ వంశానికి చెందిన పరిక్షితు మహారాజును ఏ విదముగా తన విషాగ్నితో చంపినది తెలుసుకుని పరిక్షితుడి కుమారుడు అయిన చక్రవర్తి జనమేజయుడు వద్దకు పోయి ఆయన తండ్రి పరిక్షితుడు ఏ విదంగా మరణించినది చెప్పి , తక్షకుడి పై పగ తీసుకోవాలంటే సర్పయాగము చేయవలెను అని హితము చెప్పి సర్పయగామును ప్రారంబించాడు. సర్పయాగము మొదలు పెట్టిన తరువాత సర్ప జాతిలో ఉన్న అన్ని సర్పములు ఒక్కొక్కటిగా అగ్నికిలలులో ఆహుతి అవుతుండగా, తక్షకుడు వెంటనే ఇంద్రుడిని శరణుజోచ్చాడు. యాగం మరింత తారాస్థాయికి చేరింది. ఇంద్రుడు కూడా ఆ యాగా మంటలు వద్దకు తక్షకుడితో పాటు యాగా ప్రభావము వలన ఇంద్రుడు కూడా చేరుతున్న సమయములో కారణజన్ముడు , నాగ జాతి సంరక్షకుడు అయిన ఆస్తికుడు జనమేజయుడు ని మెప్పించి సర్పయాగాన్ని అపమని కోరాడు . ధర్మ మార్గమున నడిచే పాండవ వంశాంకురంలో జన్మించిన జనమేజయుడు యాగాన్ని నిలుపుదల చేసాడు. ఆ విధముగా సర్ప యాగము జనమేజయుడు చేత మహా భారతంలో సర్పయాగము చేయబడింది. ఆ నాడు సర్పయాగము ఆపడము వలన సర్ప జాతి అంతరించకుండా భూమి పై ఉన్నాయి.




బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు 


Visit us at : www.vedanthavarshini.com


Email :  vedanthavarshini@gmail.com


All  right reserved @ copyright protection under the Copyright Act.

Post a Comment

0 Comments