శ్రీ మహా గణపతినే
నమః
శ్రీ శ్రీ శ్రీ
భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః
శ్రీ చక్ర సహిత
లలితా పరమేశ్వరినే నమః
సంస్కారము
సంస్కారము అంటే అణకువగా ఉండటము , మంచిగా
ప్రవర్తించడము అని. నమస్కారం – సంస్కారమును తెలియజేస్తుంది. ఎదుటి వ్యక్తికి మీరు
పెట్టె నమస్కారము ద్వార మీ వ్యక్తిత్వము పెరుగుతుంది. ఎదుటి వ్యక్తిలో దైవమును
చూసి మనం నమస్కారము చేయుట ద్వార సంస్కారవంతులుగా ప్రసిద్ది పొందుతారు. సాదారణముగా
జనులు ఒరేయ్ వాడితో ఎందుకురా వాడు సంస్కారాహినుడు అని అనడం వింటూ ఉంటాము. మనిషికి
మూర్ఖత్వం ఆవహించినపుడు సంస్కారహినుడిగా మారతాడు. కొంతమంది చాడీలు వినటం ద్వార ఏది
నిజం ఏది అబద్దం అనేదాన్ని విషయ సంగ్రహణ చేసుకోవడం మాని అనాలోచితముగా కొన్ని మాటలను
ఉపయోగించడం కొన్ని చేష్టలను అవలంబించడం చేస్తుంటారు. సంస్కారము అనే పదానికి పూర్తి
అర్ధం రామాయణ కథను వింటే చాలు మన నడవడిక ఏ విధముగా ఉండాలి అనేది తెలుస్తుంది.
రామాయణములో శ్రీ రాముడు దశరద మహారాజు చెప్పిన విధముగా అరణ్యవాసము చేసాడు. శ్రీ
రాముడికి తెలుసు దశరద మహారాజుకు తనని అరణ్యవాసమునకు పంపడం ఇష్టం లేదు అని. అయినా
తండ్రి ఆజ్ఞ అనుసారము సంస్కరముతో శిరసావహించాడు శ్రీ రాముడు. శ్రీ రాముడి ధర్మ
పత్ని సీతాదేవి – వివాహము అయిన వెనువెంటనే అరణ్యవాసము అన్న మారుమాట్లాడకుండా
స్వర్నాభరణములను తిసి నారా వస్త్రములను ధరించి భర్తతో పాటు అరణ్యమునకు వెళ్ళిన
సీతాదేవి సంస్కారము ఎన్ని యుగాలు, కాలాలు అయిన మరువలేనిది కధ. లక్ష్మణుడు తన
అన్నగారైన శ్రీ రాముడి అడుగుజాడలలో నడిచే వీర భక్తుడు. అయన కూడా సంస్కరముతో
కష్టములు పడుట అవసరము లేకున్నా అన్న వెంట అరణ్యవాసము చేసాడు. భరతుడు రాజ్య పాలన
చేయడానికి అర్హత ఉన్నప్పటికి, అన్న శ్రీ రాముడి మీద గౌరవముతో శ్రీ రాముడి
పాదుకులను తీసుకుని అయోధ్యలో సింహాసనము వద్ద ఉంచి, పాదుకులకు పట్టబిషేకము
చేసినాడు. శ్రీ రాముడు ఉన్నంతవరకు అయోధ్య సింహాసనం ఆయనదే అని భావించి సంస్కారముతో
మెలిగాడు. ఇక హనుమంతుడు శ్రీ రాముని పట్ల చూపే భక్తి సాదారణమైనది కాదు. ఆయన
సంస్కారము అనితర సామాన్యం. పెద్దల పట్ల గౌరవము, తోటి వయస్కుల పట్ల ప్రేమ , చిన్న
వారి పట్ల వాత్సల్యము చూపించాలి.
అందుకే మాతృ దేవో భవ , పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ , అతిధి దేవో భవ – తల్లి , తండ్రి , గురువు , అతిధి దైవంతో సమానం అని అర్దము .
దేవునుకు కి నమస్కారములు ఎనిమిది రకములు అవి
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తధా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టంగా ఉచ్చతే !
తలవంచి, సంపూర్ణముగా తలవంచి , కళ్ళతో , మనస్సులో
, మాట్లాడటం ద్వార , రెండు కాళ్ళను దెగ్గరకు చేర్చి గౌరవముతో, రెండు చేతులు
దెగ్గరకు జోడించి , రెండు చెవులను రెండు చేతులతో పట్టుకుని , బోర్లా పడుకుని
సష్టంగా నమస్కారం చేయడం ...... ఇలా మొత్తంగా ఎనిమిది రకాలుగా నమస్కారము చేయడం.
వీటిలో మనం ఎదుటి వ్యక్తికి గౌరవముతో కూడా చేస్తుంటాము. వినమ్రంగా
మాట్లాడటం , జాలి , దయా , కరుణ , ప్రేమ , వాత్సల్యం , గౌరవించడం ఇవన్ని
సంస్కారములోనికే వస్తాయి.
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
Visit us at : www.vedanthavarshini.com
Email : vedanthavarshini@gmail.com
All right reserved @ copyright protection under
the Copyright Act.
0 Comments