వజ్రాయుధం





శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః






వజ్రాయుధం



వజ్రాయుధం ఇంద్రుడు ఆయుధం అని మన అందరికి తెలిసిందే. అయితే ఈ ఆయుధం ఏర్పడడానికి ఒక మహర్షి కారకుడు. పూర్వము దధీచి మహర్షి అనే తపస్సంపన్నుడు ఉండేవాడు. ఈయన మహా భక్తుడు, ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. ఈయన చిన్నతనము నుండే భగవంతుని పట్ల భక్తి చేత సరస్వతి నది వడ్డునే ఉండి భగవంతుడిని ధ్యానంచేస్తూ ఉండేవాడు. ఆ మహావిష్ణువు ఆయన భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు, తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు చనిపోయేలా వరం ఇవ్వమని కోరుకున్నాడు ... దానికి ఆ మహావిష్ణువు తదాస్తు అని వరాన్ని అనుగ్రహించాడు . ఇది ఇలా ఉండగా ఒకనాడు ఇంద్రుడు తన గురువైన విశ్వరూపుడు రాక్షసులకు కూడా యజ్ఞ ఫలములో భాగము తనకి తెలియకుండా ఇస్తున్నాడని విచక్షణ కోల్పోయి మూడు శిరస్సులు కలిగిన విశ్వరూపుడి మూడు తలలను ఖండించాడు. ఆ కారణముగా విశ్వరూపుడి తండ్రి త్వష్ట ప్రజాపతి కి తెలిసి ఇంద్రుడిని సంహరించాగలిగే ఒక కొడుకు

కోసం పెద్ద యజ్ఞము చేసి వృత్రాసురుడు అనే భయంకర రూపంలో ఉన్న కుమారుడిని పొందాడు. వృత్రాసురుడు బ్రహ్మాండాన్ని అంతటిని వ్యాపించి ఆకాశాన్ని, నక్షత్రాలను , గ్రహాలను అన్నింటిని తన గర్జనతో, నా అన్న విశ్వరూపుడిని చంపినా ఆ ఇంద్రుడు ఎక్కడ అంటూ అరుస్తుండగా, ఇంద్రుడు తన సైన్యాన్ని అంతా తీసుకుని వృత్రాసురుడు మీదకు యుద్దానికి వెల్లాడు. బ్రహ్మండమంతా నిండి పోయిన శరీరంతోఉన్న ఆ రాక్షసుడు ఇంద్రుడి వారి సైన్యం వేస్తున్న అన్ని అస్త్రాలను నోటిలో వేసుకుని చప్పరించాడు. ఇంద్రుడికి ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితిలో శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి వెళ్లి స్వామికి జరిగిన వృత్తాంతం చెప్పి శరణుజోచ్చాడు. శ్రీ మహావిష్ణువు వృత్రాసురుడుని సంహరించడానికి వజ్రాయుధం అవసరం అని, అది ధర్మ భద్దుడు అయిన దధీచి మహర్షి వెన్నుముకనే ఆ  వజ్రాయుధం. అందువలన దధీచిమహర్షి వద్దకు పోయి అయన వెన్నుముకను కోరవలసిందిగా సెలవిచ్చాడు . ఇంద్రుడు, ఇతర దేవతలు దధీచి మహర్షి వద్దకు పోయి వృత్రాసురుడుని సంహరిచడానికి శ్రీ మహావిష్ణువు మీ వెన్నుముకను అయుదముగా మార్చి వృత్రాసురుడుని సంహరించడానికి ఇది ఒక్కటే మార్గమని సెలవిచ్చారు అని చెప్పాడు ఇంద్రుడు. నా వెన్నుముకతో హింస చేయడానికి వాడతారా అని ప్రశ్నించాడు. ఇంద్రుడు వెంటనే మాకు వేరే గత్యంతరం లేదు తమని కాపాడు వారు వేరెవ్వరు లేరు మీరు తప్ప అని అనగా, కాస్త పరిహసించాను కంగారుపడకు. నేను, నా శరీరము కేవలం ధర్మబద్ద కార్యక్రమములు కొరకు మాత్రమే, ఎదో పరిహాసము కోసం ఆ ప్రశ్నవేసాను. సర్వ విద్యా సంపన్నుడు, శ్రీ మహావిష్ణువు తనకు ఇచ్చిన వరం.... ప్రాణము ఎప్పుడు కావాలి అంటే అప్పుడు విడిచే వరమును ఉపయోగించి దధీచి యోగ విద్యతో తనలో ఉన్న ప్రాణ వాయువును స్తంబింపచేసి శారిరాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు. ఆ శరీరాన్ని కోసి ఎముకలను విశ్వకర్మకు ఇచ్చి వజ్రాయుదము తయారుచేయమని చెప్పారు.  విశ్వకర్మ నూరు అంచులు గల మహా ఆయుధమును వెనువెంటనే సిద్దం చేసాడు.... అదే వజ్రాయుదము. అలా తయరుకాబడిన వజ్రాయుదమును చేతబట్టి సైన్యముతో వృత్రాసురుడు మీదకు యుద్దమునకు పోయాడు. వృత్రాసురుడు వికటాట్టహాసముతో  నవ్వుతు ఇంద్రుడిని మ్రింగివేస్తాడు. లోపల ఉన్న ఇంద్రుడు నారాయణ మంత్రమును జపించుట వలన ఆ మంత్ర ప్రభావము వల్ల జీర్ణము కాకుండా తన వజ్రాయుదముతో పొట్టను చీల్చి బయటకు వచ్చి ఉత్తరాయణ, దక్షిణాయన మద్య కాలములో వజ్రాయుదముతో వృత్రాసురుడు తలను ఖండించాడు. ఆ విదముగా ర్రక్షస సంహారం వజ్రాయుదముతో జరిగింది.







బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు


Visit us at : www.vedanthavarshini.com


Email :  vedanthavarshini@gmail.com


All  right reserved @ copyright protection under the Copyright Act.

Post a Comment

0 Comments