విదురుడు









శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః







విదురుడు 



పన్నెండు మంది మహాజనులలో యమధర్మరాజు ఒకరు. యమరాజు ఒక ముని శాపము కారణముగా శూద్రునిగా జన్మించిన వాడే విదురుడు. ఒక రాజ్యములో దొంగతనం జరిగితే ఆ రాజ్య రక్షక భటులు ఆ దొంగలను వెంబడించి పట్టుకోడానికి ప్రయత్నిస్తున్న సమయములో ఆ దొంగలు మండుకమునిని కూడా దొంగ అనుకుని అతనికి కూడా బల్లెపుపోటుతో మరణ శిక్షను విదించాడు ఆ రాజ్య న్యాయదిపతి. అది తెలుసుకున్న మహారాజు శిక్ష అమలును మధ్యలోనే ఆపివేసి క్షమాపణ చెప్పి కారాగారము నుండి విడుదల చేసారు. ఆ బల్లెపుపోటు గూర్చి యమదర్మ రాజు దెగ్గరకు పోయి అడగగా, యమధర్మరాజు దానికి బదులిస్తూ నీవు చిన్నతనములో ఒక చీమను దర్భతో పొడిచిన కారణముగా ఇప్పుడు ఈ బల్లెపుపోటుకు గురికావలసి వచ్చినది. దానికి మండుకముని ఆగ్రహించి చిన్నతనములో తెలియక చేసిన చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్షా అని యమధర్మ రాజును శూద్రుడువు అవ్వమని శపించాడు. ఆ కారణము చేత విదురుడి గా జన్మించాడు.

కురు వంశములో జన్మించి ధర్మ బద్దముగా నడిచే వ్యక్తి విదురుడు అయితే విదురుడు జననం దేవరన్యాయం ప్రకారము సంభవించినది. శంతనుడు , సత్యవతి దంపతులకు ఇద్దరు కుమారులు వారి పేర్లు చిత్రాంగదుడు , విచిత్ర వీర్యుడు. శంతనుడు మరణం తరువాత చిత్రాంగదుడు రాజ్య పాలన ఆరంబించాడు. ఒకనాడు చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్దం చేసి ఆ యుద్దములో మరణించాడు. ఆ తరువాత విచిత్రవీరుడు రాజయ్యాడు. విచిత్రవిరుడుకి ఇద్దరు భార్యలు వారు అంబిక , అంబాలిక. విచిత్రవీరుడికి అనారోగ్యము చేత నిస్సతువుగా మారుటవలన పిల్లలు కలగలేదు. వంశరక్షణార్దం దేవరన్యాయం ప్రకారము పిల్లలు జన్మించే ఆస్కారము ఉన్నదని భీష్ముడు చెప్పాడు. దేవరన్యాయం అనగా ఒక మహా పురుషుడి వీర్య దానము వలన కలిగే సంతానం. ఆ మహాపుషుడు వ్యాసుడు. వ్యాసుడు కూడా సత్యవతి దేవి కుమారుడే . వ్యాసుడిని సత్యవతి దేవరన్యాయం ప్రకారము కురు వంశాన్ని నిలుపమని కోరింది. దానికివ్యాసుడు సమ్మతించాడు. సత్యవతి అంబికను వ్యాసుడు ఉన్న గది లోకి పంపింది , అంబిక వ్యాసుడి చూసి బయపడి కళ్ళు ముసుకునుట వలన గుడ్డివాడుగా దృతరాష్ట్రుడు జన్మించాడు, అంబాలిక వ్యాసుడిని చూసి భయంతో వణుకుట వలన  పాండురోగము (వణుకుట జబ్బు)  గల పాండురాజు జన్మించాడు. మంచి వారసత్వము కొరకు చేసిన ప్రయత్నము ఉపయోగము లేకుండా పోయింది అని బాధ పడుతూ వ్యాసుడిని మరొక్క మారు వ్యాసుడిని మంచి వారసత్వాన్ని ఇవ్వమని అడుగగా సరే అని చెప్పాడు. సత్యవతి మళ్ళి అంబికను వెళ్ళమని చప్పగా వెళ్ళటానికి నిరాకరించి తన వద్దనున్న దాసిని వ్యాసుడి దెగ్గరకు పంపింది. అలా దాసి కడుపున జన్మించిన వాడే విదురుడు. దాసీ కడుపున జన్మించినప్పటికీ భీష్ముడికి ఎంతటి మర్యాద ఉండేదో అంతే మర్యాదను కౌరవులు , పాండవులు ఇచ్చేవారు. దృతరాష్ట్రుడు వద్ద మంత్రిగా ఉండి రాజ్య పరిపాలనలో సలహాలు , సూచనలు చేసేవాడు. ధర్మబద్దముగా నడిచేవాడు విదురుడు. ద్రౌపదికి వస్త్రాపహరణము చేసే సమయమున కౌరవులకు ఇది సమంజసము కాదని చెప్పాడు, ఇదే కాక పాండవులు రాజ్యమును కోల్పోయినప్పుడు దుర్యోధనుడు కు హితము చెప్పినవాడు, లక్షాగ్రుహములో ఉన్న పాండవులకు కౌరవ పన్నాగాన్ని పాండవులకు చెప్పి వారిని రక్షించిన మహానుభావుడు.  శ్రీ కృష్ణుడి కురుక్షేత్ర యుద్దము జరగకుండా ఉండటానికి రాయభారిగా కౌరవుల దెగ్గరకు వచినపుడు విదురుడికి , భీష్ముడికి అంతా వివరముగా చెప్పాడు. అది గ్రహించిన విదురుడు దుర్యోదనుడికి పాండవులకు వారి రాజ్యాన్ని ఇవ్వమని హితవు పలికాడు విదురుడు కాని ఆ మాటలు నచ్చని దుర్యోధనుడు విడదురుడను రాజ్య భాహిస్కరణ చేసాడు. శ్రీ కృష్ణుడు కారణముగా ధర్మబద్దుడు అయిన విడురుడిని అధర్మము వైపు ఉండకుండా పాప కార్యము మరలా ఈ జన్మమునందు చేయకుండా , కౌరవుల తరపున కురుక్షేత్ర యుద్దములో పాల్గొనకుండా చేసాడు. రాజ్య బహిష్కరణ జరిగినది అని భాదించకుండా దైవదర్శనార్దము తీర్దయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోయాడు.







బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు

Visit us at : www.vedanthavarshini.com

Email :  vedanthavarshini@gmail.com

All  right reserved @ copyright protection under the Copyright Act.

Post a Comment

0 Comments