శివాభిషేకం ఫలాలు






శివాభిషేకం ఫలాలు











శివునికి అభిషేకము అన్న మహా ప్రీతి .శివాలయములో శివునికి రకరకాల

ద్రవ్యములతో అభిషేకము చేస్తుంటారు. వాటి వల్ల చేకూరే ఫలాలు.




జలముతో –  నష్టపోయినవి తిరిగి లభించును.


కొబ్బరి నీళ్ళతో – సకల సంపదలు సిద్దించును.


పుష్పాలతో ఉన్న నీటితో – భూ లాభము.


ఆవుపాలు –  సర్వ సౌఖ్యములు కలుగును.


ఆవు నెయ్యి-  ఐశ్వర్య ప్రాప్తి.


గరిక నీటితో – నష్టపోయిన ద్రవ్యము తిరిగి లభించును.


చెరకు రసంతో – ధన వృద్ది కలుగును.


ఆవు పెరుగుతో – ఆరోగ్యము , యశస్సు లభించును.


మారేడు బిల్వ దళ జలముతో- భోగభాగ్యములు సిద్దించును.


తేనెతో – తేజో వృద్ది.


భస్మముతో అభిషేకము-మహా పాపాలు నశించును.


గంధము కలిపిన జలముతో- పుత్ర ప్రాప్తి.


బంగారము ఉంచిన జలముతో- దారిద్ర నిర్మూలన.


రుద్రాక్షలు ఉంచిన జలముతో- సకల ఐశ్వర్యము సిద్దించును.


ద్రాక్ష రసముతో- అన్నింటా విజయము.


ఖర్జూర రసముతో – శత్రు హాని హరించును.


నేరేడు పండ్లు రసముతో- వైరాగ్యము సిద్దించును.


మామిడి పండ్ల రసముతో- దీర్ఘ వ్యాదుల నశించుట.


నవరత్నములు ఉంచిన జలముతో- గృహ, గో, ధాన్య వృద్ది.


పసుపు కలిపిన జలముతో- శుభ కార్యములు, మంగళ ప్రదము.


Post a Comment

0 Comments