శ్రీ శ్రీ శ్రీ
భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః
శ్రీ చక్ర సహిత
లలితా పరమేశ్వరినే నమః
***కలిపురుషుడు***
కృతయుగం , త్రేతాయుగం , ద్వాపరయుగం , కలియుగం అనే నాలుగు యుగాలు ఉన్నాయి అని మనకి తెలుసు. కుర్దుడు, హింస అనే వారు అన్నా చెల్లెలు . వీరు వివాహం చేసుకుచేసుకుని ఒక కుమారుడికి జన్మనిచ్చారు అతనే కలిపురుషుడు. ధర్మవిరుద్దము పాపకార్యము వలన పుట్టినవాడే కలిపురుషుడు. కలిపురుషుడు అయిదు స్థానాలలో ఉండటాన్ని భాగవతంలో చెప్పబడింది.
పురవంశ మహారాజు పరిక్షిత మహారాజు రాజ్యపాలనా చేసేవాడు . ఒక రోజు ధర్మదేవత వృషభం రూపంలో ఒక కాలుతో మాత్రమే ఉన్నది అలాగే భూదేవి గోవు రూపంలో భాదతో ఇరువురు శ్రీకృష్ణుడు తన లీలలను పరిసమాప్తి చేసి వెళ్లిపోయిన తరువాత భూమండలం మీద జరుగుతున్న వాటిగూర్చి మాట్లాకుంటుండగా, రాజు వేషధారణలో వచ్చి వృషభాన్ని, గోవును తన్నటం చేత అవి పడిపోయాయి. పడిపోయిన వాటిని చూసి , పరీక్షిత్తు మహారాజు కోపంతో కలిపురుషుడిని వధించడానికి అని ఖడ్గాన్ని తీసాడు. కలిపుషుడు చావు తప్పదు అని బయపడి వెంటనే తను రాజు గ ఉన్నవేషాధారణని తీసివేసి పరీక్షిత్తు మహారాజుని క్షమించమని కోరాడు. దానికి ధర్మ మార్గంలో నడిచే మహారాజు క్షమించి నువ్వు నా రాజ్యంలో ఉండడానికి వీలులేదు అని చెప్పి నీకు కేవలం నాలుగు స్థానాలలో మాత్రమే చోటు అని జూదము , సురాపానం(మద్యపానం),వ్యభిచారం , పాశువధ ఉన్నచోట మాత్రమే నీకు స్థానము అని శపించగా కలిపురుషుడు పరీక్షిత్తు మహారాజుని నాది ఒక కోరిక తీర్చమని అడిగాడు దానికి పరీక్షిత్తు మహారాజు సరే అని కోరుకోమని చెప్పాడు. కలిపురుషుడు బంగారము ఉన్నచోట కూడా నాకు స్థానము కావాలని కోరగా ఆ ఐదవ స్థానాన్ని కూడా కలిపురుషుడికి ఇవ్వడం వలన మొత్తం అయిదు స్థానాలలో ఉంటాడు. అందుకే ఈ అయిదు స్థానాలలో పున్న వాటిని పాటించినవాడు అబద్ధము , కోపము , కామము , పగ , ఈర్ష్య గుణములను పొందుతారు. మొత్తంగా అయిదు అలవాట్లు అయిదు చెడ్డ లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది.
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
mailto: vedanthavarshini@gmail.com
All right reserved @ copyright protection under
the Copyright Act
0 Comments