దేవతలు - నైవేద్యాలు




దేవతలు - నైవేద్యాలు





పదార్ధములను దేవునికి సమర్పించడాన్ని నైవేద్యం అంటాము. అయితే 

దేవతలలో ఒక్కొకరికి ఒక్కోరకమైన పదార్ధములను నైవేద్యముగా 

పెడుతుంటాము దానికి గల కారణం దేవతలు వారికి ప్రీతిగల పదార్దములు 

పెట్టడం ద్వార మన సంకల్పము ( కోరికను పూజా విధానములో 

వ్యక్తపరచడం) సిద్దించుట కొరకు. 









వినాయకుడు – ఉండ్రాళ్ళు , కుడుములు

సరస్వతి దేవి – పప్పు బెల్లం                  

దుర్గాదేవికి – చిత్రాన్నం, పులిహోర

శివుడు – చిమిలి ( నువ్వులతో )

శ్రీ మహావిష్ణువు – చక్కర పొంగలి

సుబ్రహ్మణ్యస్వామి – పాలు బెల్లం కలిపినా పాయసం.

శ్రీ మహా లక్ష్మి – కొబ్బరి పాలతో చేసిన పాయసం , బూరెలు

శ్రీ కృష్ణుడు – అటుకులు బెల్లం

శ్రీ రాముడు – పానకం , వడపప్పు

శ్రీ సత్యనారాయణ స్వామి – గోడుమరవ్వతో చేసిన హల్వా.

శ్రీ వెంకటేశ్వర స్వామికి – నెయ్యితో చేసిన భూంది లడ్డు , దద్దోజనం

ఆంజనేయుడు – అప్పాలు , అరటిపళ్ళు

పార్వతీదేవికి – పాలతో చేసిన పాయసం

షిరిడి సాయి – జొన్న రొట్టెలు , గోధుమ రొట్టెలు

శ్రీ రాజరాజేశ్వరి దేవి – చెరకు రసం , చెరకు ముక్కలు

శ్రీ కాళికాదేవి – మినప గారెలు

సూర్యనారాయణ స్వామి- క్షిరాన్న్నం , పాయసం

చంద్రుడు – వెన్నపూస , పాలకోవా

కుజుడు - కోవాతో చేసిన బూరెలు

భుదుడు -  పెసలతో చేసిన వంటకాలు

గురుడు – సెనగలతో చేసిన వంటకాలు

శుక్రుడు – ఆవుపాలతో చేసిన పాయసం

శని – నువ్వులతో ( ముడి) చేసిన చిమిలి లేదా నువ్వులు (ముడి ) బెల్లం.

రాహువుకు – మినుములతో చేసిన వంటకాలు

కేతువు – ఉలవలతో చేసిన వంటకాలు



శ్రీ కృష్ణ భగవానుడు గీతలో చెప్పిన మాట ..... భక్తుడు సమర్పించేది పుష్పం, పత్రం , ఫలం ,తోయం ఏదైనా కావచ్చు స్వికరిస్తాను అని చెప్పాడు. నైవేద్యముగా పెట్టే పదార్ధము కన్నా భక్తి ప్రదానము. ఇది నేను భగవంతుడు - భక్తుడు అనే భక్తి రచనలో వివరించాను. భగవంతుడిని ప్రసన్నము చేసుకోడానికి భక్తి , నమ్మకం ముఖ్యం.



Post a Comment

0 Comments