ఓం శ్రీ మహా గణపతియే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీర
భద్రేశ్వర స్వామినే నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే
నమః
భగవంతుడు – భక్తుడు
రామాయణం , భాగవతం ఏది
విన్న, చదివిన భగవంతుని లీలలు తెలుస్తాయి. దేవుని ఫై భక్తులు రాగ ద్వేషాలకు
అతితముగా భగవంతుని పట్ల చూపించే భక్తిని గూర్చి వింటున్నపుడు వళ్ళు పులకరిస్తుంది.
భగవంతుడు ఏ అవతారము అవతరించినను అది భక్తుడు చూపిన భక్తికి మెచ్చి అవతరించినదే.
సాదారణముగా రాక్షస సంహారము కోసం భగవంతుడు కొత్త అవతారములో వచ్చాడని అనుకుంటూ
ఉంటాము. కాని నా స్వానుభవము రిత్యా భగవంతుడు భక్తుని భక్తికి మెచ్చి వివిధ
అవతారాలలో దర్శన భాగ్యాన్ని కలిగించి విశ్వానికి ఒక ఆలోచనను కలిగించాడు. ఆ ఆలోచనే
నేను ఏ రూపములో అయిన ఉంటాను అని . నిన్ను పరీక్షించడానికి నీ ఇంటికి బిక్షగాడిగా
రాగలను, స్నేహితుడిగా పరిచయము అవ్వగలను, ముసలి అవ్వగా లేదా తాతగా ఎదురు పడగలను, ఒక
సందర్బములో భగవంతుని పట్ల వ్యతిరేకముగా మాట్లాడే వ్యక్తిగా తారసపడగలను, నీ కన్నా
ఉన్నతమైన వ్యక్తిగా, నీ కన్నా అల్పుడిగా , దేహి అని అర్దించే వ్యక్తిగా, నిండు
గర్బినిగా, పురోహితుడిగా, చిన్నపిల్లాడిగా, ఏ రూపములో అయిన మనకు అగుపించవచ్చు. ఈ
భూమి మీద ప్రతీ ప్రాణి ఒక కార్యము కోసమే జన్మించింది. అందున మానవ రూపము మరింత
శ్రేష్టమైనది. మానవ రూపములో ఉన్నవారికి మంచి, చెడు, న్యాయం ,ధర్మం అని ఆలోచించగలిగే
శక్తీని భగవంతుడు అందించాడు. దానిని చెడు ఆలోచనలను తావివ్వకుండా మంచిగా అన్నింటిలో
భగవంతుడిని చూసుకోవడం ద్వార ప్రకృతికి మంచి చేయవచ్చు. ఎదుటి వారి పట్ల మృదుత్వంతో
కూడిన మాటలు మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది. ప్రహ్లాదుడు భక్తికి మెచ్చి నారసింహ
అవతారములో ప్రత్యక్షం అయ్యాడు. భక్తి మాత్రమే భగవంతుడు లొంగుతాడు. భగవంతుడికి
దేనిపట్ల వ్యామోహం ఉండదు. నువ్వు పదార్ధాన్ని బంగారపు పాత్రలో పెట్టావా లేదా మట్టి
పాత్రలో పెట్టావా అని భగవంతుడు ఆలోచించడు. నీ భక్తిని మాత్రమే చూస్తాడు.
ఉగ్రరుపములో ఉన్న నారసింహుడుని శాంతింపచేయడానికి బ్రహ్మ, శివుడు,ఇంద్రుడు సమస్త
దేవతలు చేసిన ప్రయత్నములు వ్యర్ధము అవగా దేవతలందరూ లక్ష్మీదేవిని నీవు
ప్రయత్నించమని అడిగారు దానికి ఆ లక్ష్మీదేవి బదులిస్తూ ఇలాంటి రూపాన్ని నేను
ఇదివరకెన్నడు చూడలేదు అని అన్నది. బ్రహ్మ ఇతర దేవలతో నారసింహుడు ఉగ్రరుపాన్ని శాంతించడానికి
కేవలం మహాభక్తుడైన ప్రహ్లాదుడి వల్లమాత్రమే ఇది అవుతుంది అని ప్రహ్లాదుడికి
అప్పగించారు. మహా భక్తుడైన ప్రహ్లాదుడు నారసింహుడి పాదాలను తాకి నమస్కారము చేసి
భక్తితో స్తుతించుట ద్వార మహా ఉగ్ర రూపములో ఉన్న నారసింహుడుని శాంతింపచేసాడు.
కాబట్టి ఆ భగవంతుడు ఎంతటి ఎత్తులో ఉన్న, ఎంతటి ద్యానంలో ఉన్న, ఎంతటి ఉగ్ర రూపములో
ఉన్న భక్తితో ప్రసన్నం చేసుకోగలము. నీకు అన్ని ఇచ్చేది భగవంతుడు అయినప్పుడు నీ
నుండి భగవంతుడు ఏమి ఆశించడు కేవలం నీ నుండి వచ్చే భక్తి అనే సువాసనను మాత్రమే.
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
Visit us at : www.vedanthavarshini.com
Email : vedanthavarshini@gmail.com
All right reserved @ copyright protection under
the Copyright Act.
0 Comments