అభ్యంగనా స్నానం




ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః



***అభ్యంగనా స్నానం***



ముందుగా అభ్యంగనా స్నానం అని దేనిని అంటారు అనేది తెలుసుకుందాం. అభ్యంగనస్నానం అంటే తైలము శరీరాన్ని అంతటికి పట్టించి నలుగు పిండి శరీరానికి పెట్టి తల స్నానం చేయడాన్ని అభ్యంగనస్నానం అంటారు . అభ్యంగనస్నానం  ను ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు. పూజలు ,వ్రతాలు, శుభకార్యాలకు అభ్యంగన స్నానం చేయమని చెప్తారు మన పూర్వికులు పెద్దలు. అయితే అభ్యంగన స్నానం ఏ రోజుల్లో ఏ సమయం లో చేయాలి అనే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అభ్యంగనస్నానం బ్రహ్మ ముహూర్తంలో చేయాలి.  బ్రహ్మమూర్తం అంటే సూర్యోదయానికి ముందు అనగా తెల్లవారుజామున చేయాలి . అలాగే సోమవారం ,బుధవారం మరియు శనివారం రోజులు చాల శ్రేష్టమైనవి. సోమవారం అభ్యంగనస్నానం చేయడం వలన శరీరానికి లావణ్యం, తేజస్సు వస్తుంది. బుధవారం చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యం ,శనివారం చేయటం వలన సకల కోరికలు నెరవేరుటకు అభ్యంగనస్నానం ఉపయోగపడుతుంది . ఆదివారం , మంగళవారం , గురువారం , శుక్రవారములు అభ్యంగనస్నానమునకు నిషిద్ధం . ఈ  రోజులు తలస్నానం నకు కూడా వర్తిస్తుంది. 



బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు


All  right reserved @ copyright protection under the Copyright Act.


Post a Comment

0 Comments