ఓం శ్రీ మహా
గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ
భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః
శ్రీ చక్ర సహిత
లలితా పరమేశ్వరినే నమః
***పరీక్షితుడు ఎవరు?***
పరీక్షితుడు పాండవ వంశాంకురం. అభిమన్యుడు , ఉత్తర దంపుతుల బిడ్డ. ఈయన జన్మము కూడా భాగవతంలో శ్రీకృషుడి లీలలో ఒకటి. కురుక్షేత్ర యుద్ధం అనంతరం శ్రీకృష్ణుడు హస్తినాపురమును వదిలి ద్వారకకు వెళ్ళటానికి సిద్దమైన సమయమున , అశ్వత్దముడు పాండవవంశాన్ని పూర్తిగా తుదముట్టించాలి అంటే ఇదే మంచిసమయము అని భావించి ఉత్తర గర్భములో ఉన్న శిశువు మీదకు బ్రహ్మస్తారాన్ని ప్రయోగించాడు. ఆ సమయములో ఉత్తర శ్రీకృష్ణుడిని వేడుకోగా శ్రీకృష్ణుడు అభయమిచ్చి సుదర్శనచక్రాన్ని చేపట్టి ఉత్తర గర్భములోకి చేరి ఆ శిశువుకు రక్షణగా నిలిచి అశ్వత్దామా విడిచిన అస్త్రాన్ని నిలువరించి ఆ శిశువుని కాపాడాడు. ఈ సమయములో గర్భములో ప్రవేశించిన ఆ శ్రీకృష్ణుడు మహా తేజస్సుతో ఉండటంచేత ఈ మహాపురుషుడు ఎవరా అని పరీక్షగా చుడటముచేత ఆ శిశువుకి పరీక్షితుడు అని నామము వచ్చినది. జన్మించిన తరువాత తాతగార్ల సంరక్షణలో దినదినాభివృద్ధి చెందుతూ పాండవుల ప్రస్థానం తరువాత రాజ్యపాలన చేపట్టి, వివాహమాడి, నలుగురు కుమారులకు పొంది సుభిక్షమైన రాజ్యపరిపాలన చేసాడు.
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
All right reserved @ copyright protection under
the Copyright Act
