ఓం శ్రీ మహా
గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ
భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః
శ్రీ చక్ర సహిత
లలితా పరమేశ్వరినే నమః
***జాతా సౌచం ,
మృతా సౌచం***
అసలు సౌచం అంతే ఏమిటి అంటే మైలు అని అర్ధం. జాతా అనగా పుట్టిన అని అలాగే మృత అంటే మరణం . జాతా సౌచం అంటే పురిటి మైలు అని , మృతా సౌచం(శివైక్యం)అనగా మరణం వలన వచ్చే మైలు.
అయితే సాధారణంగా ఈ రెండు మైలు కు 11 రోజుల అంటూ ఉంటుంది . మైలు ఉన్నవారిని పలకరించడానికి వెళ్తుంటాం కదా వచ్చాక స్నానం చేయాలి అని పెద్దలు చెప్తుంటారు కారణం ఏమిటి అంటే ఆ మైలు వల్ల పలకరింపుకు వెళ్లిన వారికి కూడా ఆ అంటూ అంటుకుంటుంది అని స్నానం చేయాలి అంటారు. మైలు ఉన్న వారి ఇంటికి వెళ్లి మైలు పడినవారు శుద్ధి చేసుకోకపోతే వారికీ కూడా ఈ ఇలాంటి అనగా పురుడు అయితే పురుడు , మరణం అయితే మరణ సంబంధిత కార్యం వారికీ కూడా జరుగుతుంది అని శాస్త్రం చెపుతోంది. పురిటి మైలు వచ్చేదాని వల్ల మంచే జరుగుతుంది కానీ మరణం ను ఎవరు కోరుకోరుగా అందుకే స్నానం చేయాలి అంటారు. అయితే స్నానం కూడా ఇంటికి వచ్చాక చేయడం కాదు. మైలు ఉన్న ఇంటికి వెళ్లి పలకరించిన పిదప తిరుగు ప్రయాణంలో ఏదయినా సముద్రం , నది, సరస్సు , కాలువ , బావి లో స్నానం చేసి దేవుడి దర్సనం చేసుకుని ఇంటికి రావడం మంచిది.
***జాతసౌచం***
దీనినే పురిటి మైలు అంటారు అని తెలుసుకున్నాం కదా. అయితే పురిటి మైలు ఉన్నవారు 11 రోజులు అంటు ఉంటుంది, ఈ మైలు మంచికి సంబంధించింది అనగా సంతోషించదగ్గ విషయం కాబట్టి ఇలాంటి మైలు ని కలుపుకున్న మంచి జరుగుతుంది అని నానుడి. ఈ మైలు లో ఉన్నవారు వంట వార్పూ, మంచమును ఉపయోగించడం వంటివి చేయొచ్చు. మైలు ఉన్నవారి ఇంట్లో దేవుడి గదిలో ఇంటిపేరు కానీ వారు దీపారాధన వంటివి చేసి నైవేద్యం కూడా నివేదించవచ్చు. 11 రోజులు తరువాత దీపారాధనలు, దానాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, వ్రతాలు, అర్చనలు, కుంకుమ పూజలు, దేవుని దర్శనం ఆ ఇంటి పేరు గలవారే చేసుకోవచ్చు.
***మృతాసౌచం***
మృతాసౌచం మరణించిన (శివైక్యం ) వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకు సంక్రమించే మైలు అని అర్ధం . అయితే ఈ మైలు 11 రోజులు ఉంటుంది. ఈ 11 రోజుల సమయంలో దేవుని గదికి వెళ్ళటం,మంచం (పరుపు) తాకడం , కుబేరస్థానం (బీరువా లేదా డబ్బులు భద్రపరుచు పెట్టె) ను తాకడం వంటివి చేయకూడదు అనంతరం 12వ రోజున ఇంటిని శుద్దిచేసుకుని 13వ రోజునుండి మైలు ఉన్నవారు దీపారాధన దేవునికి నివేదన కూడా చెల్లించవచ్చు. కానీ వీరికి ఒక సంవత్సరంపాటు మైలు ఉంటుంది ఈ సమయములో వీరు యజ్ఞాలు యాగాలు, వ్రతాలు , హోమాలు వంటివి చేయకూడదు. దేవుని దర్శనం చేసుకోవచ్చు.
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
All right reserved @ copyright protection under
the Copyright Act.
0 Comments