శ్రీ మహావిష్ణువు మోహినీ రూపములో


ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః




***శ్రీ మహావిష్ణువు మోహినీ రూపములో***


క్షిరసాగరమథనంలో ధన్వంతరి అనే మహాపురుషుడు ఉద్బవించాడు. ఆ మహాపురుషుడు దేదీప్యమానంగా సువర్ణ అలంకారితుడై చేతిలో అమృతకలశాన్ని పట్టుకుని ఉన్నాడు. అమృత కలశాన్ని చూడగానే రాక్షసులు బలవంతముగా అమృత కలశాన్ని అపహరించారు. స్వార్థబుద్ధితో ఉన్న రాక్షసులు వారిలో వారే అమృతం నాకు కావాలి నాకు కావాలి తగువులాడుకొనుచుండగా, రాక్షసులలో అల్పబలము కలవారు అమృతము దేవతలకు కూడా చెందాలి అని నీతి వ్యాఖ్యలు చేస్తుండగా, దేవతలు కలవరపడుచున్న సమయమున శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించినాడు. సర్వాంగసుందరంగా హొయలువలుకుతూ , చక్కని కురులు దివ్యమైన తేజస్సు సన్నని నడుము, అద్భుతమైన ముఖకవళికలతో కూడిన ముఖ బింబము, తన నడకతో , శరీర సౌందర్యముతో రాక్షసుల మనస్సును దోచి, ఏ కార్యము కొరకు వారిలో వారు కలహము చెందారో దానిని మరిచేంతగా వారిని మార్చినది ఆ రూపము. రాక్షసులలో వారిలో వారు ఒక నిర్ణయానికి వచ్చి మోహిని నీవే ఈ సమస్యకు పరిష్కారము చూపాలి అని తనవద్దకు వెళ్లి ఆ అమృతకలశాన్ని తన చేతిలో పెట్టారు.. నేను న్యాయము చేసిన అన్యాయము చేసిన ఒప్పుకుంటాను అంటేనే నేను ఈ బాధ్యతనుస్వీకరిస్తాను అని తీయని మాటలతో వారిని గారడీ చేసినది. దానికి వారు నువ్వు ఏది చేసిన మాకు సమ్మతమే అని చెప్పారు. అప్పుడు మోహిని దేవి కలశాన్ని పట్టుకుని వయ్యారముగా నడుస్తూ రాక్షసులదెగ్గరకు వెళ్లి కవ్వింపు మాటలతో మంతముగ్దులను చేసి దేవతలకు ఆ అమృతాన్ని అందిస్తుండగా, రాహువు అనే రాక్షసుడు దేవతా రూపములో నెమ్మదిగా దేవతల మధ్యకు చేరి ఆ అమృతాన్ని సేవించుచున్నాడు. అది గమనించిన సూర్యుడు , చంద్రుడు ఆ విషయాన్నీ మిగతా దేవతలకు చెప్పడం ద్వారా మోహిని దేవికి ఈ విషయం తెలిసి రాహువు అమృతాన్ని సేవిస్తున్న సమయాన్న చక్రాయుధముతో శిరస్సుని ఖండించింది. అమృత భాగము రాహువు యొక్క శరీరమునకు చేరలేదు కేవలం శిరస్సు నందు మాత్రమే ఉంది. శిరస్సుకు అమృత ప్రభావము వలన ప్రాణము ఉన్నది. ఆ విధముగా రాహువు యొక్క శిరస్సు అమరత్వాన్ని పొందింది. బ్రహ్మదేవుడు రాహువుని ఒక గ్రహముగా అగీకరించాడు. ఈ విధముగా శ్రీ మహా విష్ణువు మోహిని రూపములో దేవతలకు అమృతాన్ని పంచాడు.  





బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు



All  right reserved @ copyright protection under the Copyright Act

Post a Comment

0 Comments