శ్రీ వామనావతారము




ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః





***శ్రీ వామనావతారము***





ప్రహ్లాదుడి మనుమడు బలి చక్రవర్తి ఒక నాడు ఇంద్రుడిపై దేవాసుర యుద్దములో ఓడిపోయాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు బలిని రక్షించి గురోపదేశము చేసి విశ్వజిత్ యాగము ను చేయగా బలికి మహాశక్తివంతమైన ధనస్సు,అక్షయతూణీరములు , శంఖము , దేహ రక్షక కవచము , బంగారు రధము వరంగా పొందాడు. వరములు ఆర్జించిన గర్వముతో రాక్షసులందరిని ఒక చోట చేర్చి యుద్ధమునకు సిద్దపడి అమరావతి నగరంపై దండెత్తగా  ఇంద్రుడు ఇతర దేవతలు అమరావతి నగరమునుండి భయకంపితులై పారిపోయారు. బలి విజయంతో దేవతలు అందరు వైభవాహినులు అయ్యారు.దేవమాత అదితి దేవి ఇదంతా చూసి తన భర్త అయిన కశ్యపబ్రహ్మను వేడుకోగా, పయోవ్రతాన్ని చేయమని సలహా ఇచ్చాడు. ఆ పయోవ్రతాన్ని చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు అదితిదేవికి కుమారుడిగా జన్మించి లోకకల్యాణ స్థాపన చేస్తాను అని చెప్పాడు. ఆ విధముగా వామనావతారం దశావతారాలలో అయిదవ అవతారము. జన్మిచేటప్పుడు తల్లిగర్భమునుండి శంఖచక్రగదాపద్మములతో చతుర్భుజుడిగా ఆవిర్భవించి వెంటనే చిన్న బ్రాహ్మణవటువుగా మారిపోయాడు. దేవదేవుడి లీలలు ఈ రకంగా చేయటం వేరెవ్వరికైనా సాధ్యమా? లేదు కదా . భగవానుడు వామనరూపములోకి మారగానే కశ్యపుమునీ వామనుడు జన్మించిన తరువాత చేయవలసిన కార్యక్రమములను అన్నిటిని చేసి ఆ తరువాత ఉపనయమును చేసారు. సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించగా, బృహస్పతి యజ్ఞోపవీతాన్ని, కశ్యపుడు మేఖలాన్నీ, భూదేవి జింక చర్మాన్ని,చంద్రుడు జింకచర్మాన్ని,తల్లి అదితి కౌపీనాన్ని, ఇంద్రుడు గొడుగును ఇచ్చారు. ఈ విధముగా వామనావతార పురుషుడు లోకసంరక్షణ కోసం అవతరించాడు. భృగువంశీయులైన బ్రాహ్మణులు నేతృత్వములో బలిచక్రవర్తి అశ్వమేధయజ్ఞము చేస్తున్నాడని తెలుసుకుని దేవదేవుడు అక్కడకు వెళ్ళాడు. దేవదేవుడి తేజస్సును చూసి బలిచక్రవర్తి,శుక్రాచార్యుడు మరియు ఇతర బ్రాహ్మణులు తేజోహీనులు అయ్యారు. బలిచక్రవర్తి వామనుడిని సాదరముగా ఆహ్వానించి పాదప్రక్షాళన చేసి శిరస్సుపై పాదప్రక్షాళన చేసిన నీటిని శిరస్సుపై చల్లుకుని, ఎవరు నీవు ఏమి కావాలి అని అడుగగా, దానికి వామనుడు నేను ఒంటరివాడను సరే దాతవు కనుక అడుగుచున్నాను అని మూడడుగుల నేలను ఇవ్వమని అడిగాడు. సరే అని బలిచక్రవర్తి చెప్పగా గురువు శుక్రాచార్యుడు వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని గ్రహించి బలిచక్రవర్తికి వామనుడి గూర్చి చెప్పి ఇచ్చిన మాటను వెనకకు తీసుకోమని సలహా ఇవ్వగా దానికి గురువు చెప్పిన ఇచ్చిన మాటను తప్పను అని బదులిచ్చాడు . దానికి ఆగ్రహించిన శుక్రాచార్యుడు ఐశ్వర్యహీనుడు అవ్వమని శపించాడు. బలిచక్రవర్తి వామనుడి చేతులను కడిగి నీటి దారను విడిచి మూడు అడుగుల నేలను దానమిచ్చాడు. అపుడు వెంటనే వామనుడు తన శరీరాన్ని అనంతంగా పెంచి భూమి , సకలలోకాలు , ఆకాశము, నలుదిక్కులు, సముద్రాలు, విశ్వ బిలము, మానవులు, పశుపక్షాదులు, దేవతలు,ఋషులు,సమస్తమును తన దేహములో ఇమిడేటట్లుగా తన శరీరాన్ని పెంచి ఒక్క అడుగుతో భూమండలాన్ని, రెండవ పాదముతో స్వర్గాన్ని ఆక్రమించాడు. ఆలా ముందుకు రెండవ అడుగువేయగా లోకాలన్నీదాటి ఇక మూడవ అడుగువేయడానికి చోటులేకపోవటంవలన బలిని అడగగా తన శిరస్సుపై ఉంచమని చెప్పి వామనదేవుడి పాదాన్ని తన శిరస్సుపై ఉంచాడు. ఆరకంగా వామనావతారము పరిసమాప్తము అయినది.





బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు


All  right reserved @ copyright protection under the Copyright Act 

Post a Comment

0 Comments