శివుడు - శ్రీమహావిష్ణువు- మోహినీ రూపము


ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః




***శివుడు - శ్రీమహావిష్ణువు- మోహినీ రూపము***  





ఓకానొకనాడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారములో దేవతలకు అమృతాన్ని పంచాడని తెలిసి శివుడు తన భార్య ఉమాదేవితో వృషభ వాహనముమీద శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు. ఓ దేవదేవా ని అన్ని అవతారములను నేను చూసాను కానీ మోహిని రూపాన్ని చూడలేదు ఒక్కసారి ఆ దివ్యమైన రూపాన్ని నాకు అగుపించుము దేవా అని ప్రార్ధించగా..... ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువు మాయమైనాడు. శివుడు ఉమా సమేతముగా అన్నిచోట్లా వెతుకుచుండగా అరణ్యములో దివ్యమైన సౌందర్యవతిగా , నల్లని కురులతో , సన్నని నడుముతో వయ్యారముగా తన అందచందాలతో శ్రీ మహావిష్ణువు మోహిని రూపములో శివుడికి దివ్య దర్శనభాగ్యమును కలిగించాడు. మన్మధుడు కూడా తన మాయ చేత శివుడికి మొహాన్ని కలిగించలేక పోయినాడు. కానీ శ్రీ మహా విష్ణువు మోహిని రూపములో శివునికే  మొహాన్ని కలిగించి వీర్యస్ఖలనము అయ్యేంతగా సౌందర్యాన్ని ప్రదర్శించాడు. వెనువెంటనే ఆ బ్రాంతి నుండి కోలుకుని తిరిగి మరల యదారుపమునకు వచ్చాడు శివుడు. శివుడినే మాయకు గురిచేసిన ఆ దివ్యమైన సౌందర్య రూపము దేవతలు అమృతాన్ని సేవించి అమరత్వాన్నిపొందుటకొరకు క్షిరసాగర మథన వృతాంతములో మోహినీరూపాన్ని ధరించాడు. ఆ తరువాత శివుడు శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి కైలాసమునకు వెళ్ళిపోయాడు.





బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు


All  right reserved @ copyright protection under the Copyright Act 

Post a Comment

0 Comments