శ్రీ శ్రీ శ్రీ
భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః
శ్రీ చక్ర సహిత
లలితా పరమేశ్వరినే నమః
**భగవంతుడి వాహనం**
*లక్ష్మీదేవి
వాహనం గుడ్లగూబ*
దక్షిణ భారత
ఆలయాల మీద లేదా గోపురాలు దేవతలు లేదా జంతువులతో చెక్కబడ్డాయి. హిందుమత పురాణంలో
జంతువులను ప్రత్యక్షంగాను లేదా దేవుళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు
చెప్పబడింది. సాధారణంగా కొన్ని రకాల జంతువులను కొందరు హిందూ దేవుళ్ళకు వాహనాలుగా
పేర్కొన్నారు. చాలా మంది ఈ జంతువులను దేవుళ్ళకు వాహనాలగా మాత్రమే తెలుసు. కానీ
వారు(ఆ జంతువులు)ఏదో ఒక అపజయాన్ని ఎదుర్కోవడం లేదా పాపమూ చేయుట ద్వారా శాపాన్ని
పొందటం వల్ల అలా మారాల్సి వచ్చిందని లేదా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని పురాణాలు
చెబుతున్నాయి. అయితే ఈ రోజు మనం గుడ్ల గూబ గూర్చి తెలుసుకుందాం . భువనేశుడనే
మహారాజు అహంకారంతో మహా విష్ట్ను భక్తుడైన హారమిత్రుడనే బ్రాహ్మణుడు విష్ణు సంకీర్తనలు మాని నన్ను నా నామాన్ని (భువనేశుడు) స్తుతించు
అని ఆజ్ఞాపించాడు. ఆ పాపకర్మచేత మరుజన్మలో గుడ్లగూబగా జన్మిచాడు భువనేశుడు .
తిరిగి హారమిత్రుడు ఇచ్చిన సలహా మేరకు శ్రీ మహా
విష్ణువును తన గానంతో కీర్తించాడు. మరుజన్మల నుండి విముక్తి పొందాడు.
గుడ్లగూబ రూపాన శ్రీ మహా విష్టువుని ఇతడు ఆరాదించిన కారణంచేత లక్ష్మీదేవి
గుడ్లగూబను తన వాహనంగా స్వీకరించింది.
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు.
mailto: vedanthavarshini@gmail.com
All right
reserved @ copyright
protection under the Copyright Act
0 Comments