ఓం శ్రీ మహా గణపతియే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీర
భద్రేశ్వర స్వామినే నమః
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే
నమః
***గంగా నది ఎలా ఏర్పడింది***
సగరచక్రవర్తి కుమారుడి కొడుకు అసమంజసుడు. ఒక నాడు అసమంజసుడు అయోధ్యను విడిచి అరణ్యమునకు వెళ్ళిపోయాడు. సగరుడు అసమంజసుడు అరణ్యమునకు వెళ్ళిపోయినకారణముగా చాల బాధపడుతున్నాడు ఆ సమయమున అసమంజసుడి కుమారుడు అంశుమానుడు తన తండ్రి కోసం వెతుకుతూ అరణ్యం లోకి వెళ్ళాడు. మార్గ మద్యలో కపిలముని దర్శనము కలిగింది. కపిలముని ని తండ్రి అసమంజసుడు వెతుకుతున్న యజ్ఞాశ్వము ఇదే కానీ బస్మిభూతులు అయిన నీ పిన తండ్రులు గంగాజల స్పర్శతో మాత్రమే ఉద్దరించబడతారు కానీ ఈ యజ్ఞాశ్వము వలన కాదు అని జ్ఞానోదయం చేసాడు. సరే అని నమస్కరించి అశ్వమును తీసుకుని అయోధ్య కు పోయి యజ్ఞము చేసిన తరువాత గంగా దేవి కొరకు తపస్సు ఆరంబించాడు. కాలక్రమములో తనువు చాలించాడు. తరువాత అంశమానుడి కుమారుడు దిలీపుడు కూడా గంగ కొరకు తపస్సు చేసాడు. దిలీపుడు కూడా కాలక్రమములో తనువు చాలించాడు. దిలీపుడి కుమారుడు భగిరధుడు గంగను భూమి మీదకు తీసుకురావడానికి గోరా తపస్సు చేసాడు. గంగ కరునించింది కాని నేను ఆకాశం నుండి భూమి మీదకు వచ్చే వేగము వలన భూమిని చీల్చుకుని పాతాళమునకు వెళ్లిపోతాను అలావెళ్ళడం నాకు ఇష్టము లేదు అంతే కాకుండా మానవులు గంగలో ములగటం వలన నాకు వరిచేసిన పాపములు నాకు కలుగును అని తన సందేహమును వెల్లడించినది. దానికి భగిరదుడు గంగదేవి, శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేసే మానవులు నీయందు స్నానము చేయుటవలన నీకు పాపుల వలన నీకు కలిగిన పాపములు అన్ని తొలగును అంతే కాక నీ వేగమును ఆప గల వాడు ఆ సదాశివుడు అని చెప్పి సదా శివుడిని తపస్సుతో మెప్పించి తన కోరికను శివుడికి చెప్పగా, శ్రీ మహావిష్ణువు పాదాలనుండి ఉద్బవించిన గంగను తన శిరస్సు మీదఉంచుకోడానికి సమ్మతించాడు. అప్పుడు గంగాదేవి భూమి మీదకు పరుగులు తీసింది. తన పితరులు భాస్మిభుతూలైన చోటుకు గంగను తీసుకుని వెళ్ళాడు. ఆ విదముగా పవిత్రమైన గంగ పితురులను తాకగానే వారు నేరుగా స్వర్గానికి వెళ్లారు. ఆ విధముగా మానవులకు గంగ ప్రత్యక్ష దైవంగా ఈ భూమి మీద సకల ప్రాణి కొటికి తన స్పర్శ ద్వార వారి పాపములను తొలగిస్తుంది.
బ్రహ్మశ్రీ RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
All right reserved @ copyright protection under
the Copyright Act.
0 Comments