క్షిరసాగర మథనం ఎందుకు జరిగింది ?


ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః






***క్షిరసాగర మథనం ఎందుకు జరిగింది ?***





ఒకసారి ఇంద్రుడు ఏనుగు మీద వెళ్తున్నాడు. ఆ సమయమున దుర్వాసముని ఎదురుపడి ఇంద్రుడిని చూసి ఆనందించి తన మెడలో ఉన్న పుష్ప హారాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇంద్రుడు అహంకారంతో ఆ పుష్ప హారాన్ని ఏనుగు తొండానికి వేసాడు అది చుసిన దుర్వాసముని ఆగ్రహించి ఇంద్రుడి ఐశ్వర్యం మత్తులో బ్రాహ్మణ కానుకను లెక్కచేయలేదు అని కోపగించి దరిద్రుడువు అవమాని శపించాడు. ఆ శాపము కారణముగా రాక్షసులతో యుద్ధము చేసి దేవతలు సమస్తాన్ని కోల్పోయారు. ముల్లోకాలులో ఉన్న దేవతలు బాధపడి బ్రహ్మదేవుని దెగ్గరకు పోయి తమ కష్టాలను చెప్పుకొన్నారు. అపుడు బ్రహ్మదేవుడు దేవతలందరితో క్షిరసాగరంలోని శ్వేతా ద్విపానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని వేడుకోగా. అందులకు శ్రీ మహా విష్ణువు ఇప్పుడు దేవతల యొక్క సమయము సరిగ్గాలేదు కాబట్టి రాక్షసులతో సంధి చేసుకొండి. ఇప్పుడు మీరు అమృతత్వాన్ని  కలిగించే అమృతాన్నిపొందడానికి ప్రయత్నము చేయాలి అందుకోసం దేవతలైన మీరు రాక్షసులు ఇరువురు క్షిరసాగర మథనం చేయాలి. క్షిరసాగరములో మందర పర్వతాన్ని కవ్వముగాను,వాసుకిని త్రాడుగాను ఉపయోగించి క్షిరసాగరాన్ని చిలకడం ద్వారా అమృతాన్ని స్వీకరించాలి ఈ క్రమములో ముందుగా క్షిరసాగరమునుండి ముందుగా వచ్చేటి వాటిని దేనిమీద మీరు మనస్సుని లగ్నము చేయవద్దు. దేవతలు అమృతాన్నిసీకరించడముద్వారా అమృతత్వాన్ని పొందటమే ఈ క్షిరసాగరమథనం యొక్క ఉద్దేశము అని హితబోధచేసి రాక్షస అధిపతి బలిమహారాజు తో సంధి చేసుకోమని చెప్పి క్షిరసాగరమథనం గావించి దేవతలకు అమరత్వాన్ని దివ్యమైన తేజస్సుని పొందేలా చేసాడు శ్రీ మహావిష్ణువు. ఈ క్రమము జరగడానికి శ్రీ మహావిష్ణువు అజితుడు అనే అవతారమును దాల్చాడు. వైరాజు భార్య దేవసంభూతి గర్భమున జన్మించి అజితుడనే నామముతో ప్రసిద్ధి చెందాడు.





బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
 

All  right reserved @ copyright protection under the Copyright Act

Post a Comment

0 Comments