శుకదేవుడు




ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః




***శుకదేవుడు***





శుకదేవుడు భాగవతాన్ని రాసిన వ్యాసమహర్షి కుమారురుడు. శుకదేవుడి జననం కూడా శ్రీ కృష్ణుడి లీలలో ఒకటి. వ్యాసుడి భార్య అనేక సంవత్సరాల తరువాత తపస్సు వల్ల వ్యాసుడు బీజాప్రదానం కారణంగా గర్భవతి అయినది. బిడ్డ 12 సంవత్సరాలు అయినా గర్భాన్ని విడిచి రాలేదు. వ్యాసుడు కుమారుడితో నాయన తల్లి గర్భమునుండి బయటకురా అని అడిగాడు. దానికి కుమారుడు గర్భము లోపల ఉన్న మాయ నుండి పూర్తిగా బయట పడనిదే నేను రాను అని చెప్పాడు. దానికి తండ్రి బయపడకు నేను ఉన్నాను అని చెప్పినా కానీ విశ్వసించలేదు. వెంటనే వ్యాసుడు శ్రీ కృష్ణుడికి విషయాన్నీ అంతటిని వివరించి ఆశ్రమానికి తీసుకువచ్చాడు. శ్రీ కృష్ణుడు బిడ్డకి నీపై ఎలాంటి మాయ ప్రభావము ఉండదు అని అభయము ఇచ్చాడు అప్పుడు బాలుడు గర్భమునుండి బయటకు వచ్చాడు. ఆ విధముగా జన్మించిన బిడ్డనే శుకుడు. ఆ తరువాత శుకుడు ఆశ్రముములో ఉండేవాడు కాదు ఒకసారి తండ్రి వ్యాసుడు ఆశ్రమములో ఉండమని బయటకు వెళ్ళవద్దు ఇక్కడే ఉండి విద్యను అభ్యసించమని చెప్పాడు. అప్పుడు ఒక నకిలీ శుకుడిని సృష్టించి ఆశ్రమములో ఉంచి దేశ పర్యటన చేసాడు. ఈ జగత్తులో మనిషికి మహారోగము కామము. కామము వల్లనే మనిషి బందించబడుతున్నాడు అని తెలుసుకుని కామాన్ని జయించి నిత్యా బ్రహ్మచారిగా ఉండిపోయాడు. శుకదేవుడు ఒక కారణ జన్ముడు. భాగవతాన్ని వ్రాసింది ఆయన తండ్రి వ్యాసుడు అయితే, ఆ వ్రాయబడ్డ భాగవతాన్ని ప్రపంచానికి ప్రవచన రూపంలో పరిచయం చేసాడు. పరీక్షిత్తు మహారాజుకు మరణించే ముందు ప్రవచన రూపములో చెప్పుచుండగా పరీక్షిత్తు మహారాజుతో పాటుగా సూతగోస్వామి మరియు సర్వజనులు విన్నారు. ఈ విధముగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరుగాంచాడు.





బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,

జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు



All  right reserved @ copyright protection under the Copyright Act


Post a Comment

0 Comments