సూర్యగ్రహణం 21-6-2020





ఓం శ్రీ మహా గణపతినే నమః
శ్రీ శ్రీ శ్రీ భద్రకాళీ సమేత వీర భద్రేశ్వరా స్వామినే నమః 
శ్రీ చక్ర సహిత లలితా పరమేశ్వరినే నమః




బ్రహ్మశ్రీ  RPh. పెనుమత్స భద్ర గారు M.Sc., M.Phil., BL.ISc., D.Phrm.,SAS., PGDCA.,
జ్యోతిష్య ,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు
పశ్చిమ గోదావరి జిల్లా - 534406
తోకలపల్లి, ఫోన్ నెంబర్ 9959001886
Email: vedanthavarshini@gmail.com




సూర్యగ్రహణం 21-6-2020


శ్రీ శార్వరి నామ సంవత్సరం జేష్ఠ అమావాస్య ఆదివారం అనగా 21-6-2020 న మృగశిర నక్షత్ర 4 వ పాదము మరియు ఆరుద్ర నక్షత్ర 1వ పాదములలో మిథున రాశి నందు రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుచున్నది.



సమయం 



ఆంధ్రపదేశ్ లో :  

గ్రహణ ఆరంభ కాలం  ఉదయం 10:23 ని నుండి  

గ్రహణ మధ్యకాలం మద్యాహ్నం 12:05 ని కు

గ్రహణ అంత్య కాలం  మద్యాహ్నం 1:51 ని వరకు


తెలంగాణలో :  

గ్రహణ ఆరంభ కాలం  ఉదయం 10:14 ని నుండి  

గ్రహణ మధ్యకాలం ఉదయం 11:55 ని కు

గ్రహణ అంత్య కాలం  మద్యాహ్నం 1:44 ని వరకు



ఆచరణ:


గ్రహణం రోజునాడు అందరు ఉదయం 9:00 గం లోపు స్నానం ,అల్పాహారం ముగించుకోవాలి. గ్రహణం మిథున రాశిలో ఏర్పడుతుంది కాబట్టి మృగశిర , ఆరుద్ర , పునర్వసు నక్షత్రం కల వారు గ్రహణ సమయములో బయటకు వెళ్ళటం లేదా గ్రహనమును చూడటం చేయకూడదు అదే విదముగా గ్రహణ సమయములో అన్న పానాలు తీసుకోరాదు, మల ముత్ర విసర్జనాలు చేయరాదు. గ్రహణ పారంభానికి ముందు చేసేటి స్నానంను పట్టు స్నానం అని గ్రహణం అయిన తరువాత చేసీ స్నానం ను విడుపు స్నానం అంటారు. గ్రహణ సమయములో మంత్ర అనుష్టానం కలవారు ఆ మంత్రమును జపించవలెను, మిగిలిన వారు సుర్యగ్రహ మంత్రం, రాహు గ్రహ, దుర్గ సప్త శ్లోకీ ,ధన్వంతరి మంత్రములను జపించవలెను. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోన వ్యాది ప్రబలుతున్న వేళా ఈ మంత్రములను జపించుట ద్వార ఉపసమనం కలుగును. గ్రహణం అనంతరం ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకుని (కడుగుకుని), విడుపు స్నానం చేసి,  కాస్త పసుపుని నీటిలో కలిపి ఇంట్లో మరియు పరిసరాలలో చల్లుకునుట ద్వార గ్రహణం అనంతరం శుద్దిజరుగుతుంది. యజ్ఞోపవీతం ఉన్నవారు ( జంద్యం ) మార్చుకుని తరువాత ఆవుకి గోదుమలు. బియ్యం, మినుములు కాస్త తోటకూర పెట్టి ప్రదక్షిణ నమస్కారం చేయవలెను. దైవదర్సనం చేసుకోవలెను. గ్రహణం అనంతరం మంత్ర జపం చేయవలెను.

మేష , సింహ , కన్య  , మకర రాశి వారికీ శుభ ఫలం

వృషభ , తులా , ధనుస్సు , కుంభ రాశులవారికి మద్యమ ఫలం

మిథున , కర్కాటక , వృశ్చిక , మీన రాశులవారికి అధమ ఫలం అనగా అరిష్టం    


గ్రహ శాంతి:


మిథున రాశి వారు, మృగశిర, ఆరుద్ర నక్షత్రం వారు, వృశ్చిక , కర్కాటక , మీన రాశి వారు శాంతి చేయించుకోవలెను, దానం ఇవ్వవలెను.

      
మంగళం మహాత్

Post a Comment

0 Comments