నవరత్నధారణ
మన
జీవితములో సుఖం , సంతోషం , లాభం , మానసిక ప్రశాంతత కోరుకోవడం సహజం. ఇవి పొందడానికి
మన జాతకములో ఉన్న జాతక చక్రమును అనుసరించి రత్న ధారణ చేయవలెను. జాతకములో లగ్న,
పంచమ , షష్టమ , సప్తమ మరియు అష్టమ భావాలు అత్యంత ముఖ్యమైనవి.
ఇప్పటి
రోజుల్లో చాలామంది జన్మకాల దశ ఆధారముగా రత్నధారణ చేయమని చెబుతున్నారు. ఉదాహరణకు ఒక
వ్యక్తి అనురాధ నక్షత్రం ఉన్న సమయములో జన్మించాడు అంటే వారికి జన్మకాల దశ - శని మహా
దశ అని ... అందువల్ల శని గ్రహం యొక్క జాతి రత్నం నీలం అని ... ఈ అనురాధ నక్షత్రం
ఉన్నవారిని నీలం ధరించండి అని సలహా ఇస్తున్నారు. అలాగే అనురాధ నక్షత్రం నందు
జన్మించిన వారికి జన్మకాల దశ అనంతరం భుద గ్రహ దశ ప్రారంభమవుతుంది. అప్పుడు భుద
గ్రహ అనుకూలత కోసం జాతి రత్నం పచ్చ ధరించమని చెప్తున్నారు.
కాని
పరిపూర్ణమైన పరిష్కార మార్గం మాత్రం జాతక చక్రంలో ఉన్న గ్రహ స్థానాలు ఆధారముగా జాతి
రత్నం ధరించడం ద్వార మీరు ఎదైతే పొందాలి అనుకుంటున్నారో ఆ స్థానం యొక్క గ్రహం
యొక్క జాతి రత్నధారణ ద్వార అది పొందవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి జోతిష్య శాస్త్ర
ఆధారముగా జాతక చక్రంలో ఆయుర్దాయం తక్కువగా ఉంది. అతని ఆయుర్దాయం తగ్గడానికి ఏ
గ్రహం కారణముగా ఇది జరుగుతుంది అనేది తెలుసుకుని ఆ గ్రహ జాతి రత్నమును ధరించుట
ద్వారా అతని ఆయుర్దాయము పెంచడానికి అవకాశము కలుగుతుంది. ఇలా విద్యా, ఉద్యోగ,
వ్యాపార, వివాహ , దాంపత్య, వ్యవసాయ, ఆరోగ్య , ఆర్దిక మరియు ఇతర విషయాలను అనుకూలముగా
మార్చవచ్చును.
0 Comments