భోజన విధానం
సాధారణముగా మనం భోజనం చేస్తున్నపుడు అరటి ( విస్తరి ) ఆకు చివరి కొస భోజనమునకు కుర్చున్నవారికి ఎడమ వైపు ఉండవలెను.
అదే విధముగా భోజనము చేస్తున్న వారికి కుడి వైపు మంచినీటి పాత్ర ( గ్లాసు ) ఉండవలెను.
భోజనం చేస్తున్నపుడు తుమ్ము వచ్చినచో వానికి కీర్తి హాని , దారిద్ర్యమును జన్మాంతము వరకు ఉంటుంది. దీనికి పరిష్కారముగా ( దోషము తొలగడానికి ) నీటిని శిరస్సుపై చల్లి పుట్టిన ఊరు పేరు చెప్పుకుని దేవుని తలచుకోవలెను. ఒక వేల పక్కన ఎవరు లేకపోతే వారంతట వారే నీటిని చల్లుకుని పుట్టిన ఊరు పేరు చెప్పుకొని దేవుని తలచుకోవలెను.
సాధారణముగా మన ఇంటికి భందువులు , స్నేహితులు అతిధులుగా వస్తారు. వారికి మన ఆతిధ్యం స్వికరించమని చెప్పి బోజనం స్వికరించమని అడుగుతాము. మన అతిధులు భోజనంకి కూర్చున్నపుడు వారు ఇంటి యజమానికి అంటే ఆతిధ్యం ఇచ్చే వారికి కుడి వైపు కూర్చో పెట్టవలెను.
తూర్పు దిశగా కుర్చుని భోజనం చేయడం ద్వార ఆయువు పెరుగును.
పడమట దిశగా కుర్చుని భోజనం చేయడం ద్వార
స్త్రీ కామము ,
స్త్రీ కామము ,
దక్షిణ దిశగా కుర్చుని భోజనం చేయడం ద్వార కీర్తి సిద్దించును.
అయితే తల్లిదండ్రులు జీవించి ఉన్నవారు లేదా ఎవరో ఒకరు జీవించి ఉన్న వారు దక్షిణ ముఖముగా కుర్చుని భోజనం భుజించ కూడదు.
ఉత్తర వైపు భోజనానికి తగినది కాదు.

0 Comments